![]() |
![]() |
.webp)
సోషల్ మీడియా స్టార్ గా ఢీ షో టీంలీడర్ గా నయనిపావని ఆడియన్స్ కి బాగా పరిచయమే. కొన్ని వెబ్ సిరీస్ లో యాక్ట్ చేసింది. ఇన్ఫ్లుఎన్సర్ గా పేరు తెచ్చుకుంది. ఇప్పుడు నయని పావని ఇంట్లో విషాదం చోటు చేసుకుంది. తన నాన్న చనిపోయారని చెబుతూ ఆ విషయాన్ని ఆమె తన ఇన్స్టాగ్రామ్ పేజీలో ఆడియన్స్ తో షేర్ చేసుకుంది.
‘ఒక్క జన్మలో 100 జన్మలకు సరిపడా ప్రేమనందించావ్ కానీ సరిపోలేదు.. నాకు ఇంకా కావాలి డాడీ. ఈ బాధని నా నుంచి ఎవరూ తీసుకోలేరు. ఇదొక పెద్ద గాయం నాకు. ఇది నయం కానీ నొప్పి. నిన్ను చూడలేను అనే విషయాన్ని నమ్మలేకపోతున్నాను. ఆ నవ్వు ఇంకా చూడలేననే ఆలోచన కూడా కష్టంగా ఉంది డాడీ. పండోడా అని నన్ను ఎవరు పిలుస్తారు ? రోజుకి ఐదుసార్లు ఎవరు కాల్ చేస్తారు ? ఇంత ఓర్పుగా నాతో ఎవరు ఉంటారు ? నువ్వు ఏమైనా చెయ్యి..ఎందుకంటే నీ లైఫ్ నీ ఇష్టం, నేను నిన్ను నమ్ముతున్నాను అని ఎవరు చెప్తారు ? నా పెళ్లికి నన్ను ఎత్తుకుని తీసుకెళతావనుకున్నా కానీ అంతలోనే నిన్ను ఇలా ఎత్తుకెళ్తాం అనుకోలేదు. ఇది చాలా అన్ ఫెయిర్.
2023లోకి నేను అసలు అడుగు పెట్టలేకపోతున్నాను’అని పావని ఒక ఎమోషనల్ పోస్ట్ పెట్టింది. ఆమెను ఓదారుస్తూ శ్వేతనాయుడు, మెహబూబ్, నిఖిల్ "స్టే స్ట్రాంగ్" అని కామెంట్స్ పెట్టారు. నయనిపవని షార్ట్ ఫిలిమ్స్ నటించినా రానంత పేరు మాత్రం ఢీ షోలో టీం లీడర్ చేసాక బాగా ఫేమస్ అయ్యింది. సోషల్ మీడియాలో ఫుల్ గా రీల్స్ కూడా చేస్తూ ఉంటుంది.
![]() |
![]() |